ప్రారంభమైన ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఎప్‌సెట్‌ కౌన్సెలింగ్‌

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

ఖమ్మం సహకారనగర్‌: ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ కళాశాలలో సెంటర్‌ ఏర్పాటుచేయగా తొలిరోజు స్లాట్‌ బుక్‌ చేసుకున్న 650 మంది విద్యార్థుల్లో 620 మంది హాజరయ్యారు. ఇందులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు సమీపంలోని సూర్యాపేట, మహబూబాబాద్‌, నల్లగొండ తదితర జిల్లాల విద్యార్థులు ఉన్నారు. వీరి సర్టిఫికెట్లను ఉద్యోగులు పరిశీలించాక, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మహ్మద్‌ జాకీరుల్లా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కాగా, కౌన్సెలింగ్‌ను డాక్టర్‌ చందా సుధాకర్‌ తదితరులు పర్యవేక్షించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement