పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

ఖమ్మంసహకారనగర్‌: పెన్షనర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి మేరి ఏసుపాదం, జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలపడమే కాక ఏఓ కారుమంచి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. పెన్షనర్లకు తక్షణమే నగదు రహిత వైద్యం అమలయ్యేలా హెల్త్‌ కార్డులు అందించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలు మంజూరు చేయడమే కాక సత్వరమే పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలని కోరారు. అలాగే, పెన్షనర్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు రాయల రవికుమార్‌, కనపర్తి వెంకటేశ్వర్లు, పెదమళ్ల సత్యనారాయణ, కొలికొండ శరత్‌బాబు, ఊడుగు వెంకటేశ్వర్లు, జల్లా వెంకటేశ్వర్లు, మహిళా కార్యదర్శి తాడి అంజలి, మనోహర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement