గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

ఏన్కూరు: మండలంలో సోమవారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని తూతూకలింగన్నపేట, ఏన్కూరు, భగవాన్‌నాయక్‌తండా, అక్కినపురంతండా, హిమామ్‌నగర్‌, రేపల్లెవాడలో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. అలాగే, పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. భగవాన్‌నాయక్‌ తండా, అక్కినపురం తండాల్లో ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడగా, ఓ చెట్టు లారీపై పడింది. తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో ఏన్కూరు నుంచి జూలూరుపాడు మండలం వినోభానగర్‌ వరకు రెండు వైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. జేసీబీ సాయంతో చెట్లను తొలగించి పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, 30 స్తంభాలు, ఎనిమిది ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరగడంతో విద్యుత్‌శాఖకు సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని అంచనా. ఇక భగవాన్‌నాయక్‌ తండాలో జర్పుల సూర్య ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి.

చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు అంతరాయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement