పీఆర్‌సీ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీ అమలు చేయాలి

Jun 23 2026 1:34 AM | Updated on Jun 23 2026 1:34 AM

బోనకల్‌: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు పెన్షనర్లు ఎదురుచూస్తున్నందున ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో సంఘం సభ్యత్వ నమోదును సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పీఆర్‌సీ కమిటీ కాలపరిమితి పూర్తయినందున ప్రభుత్వం స్పందించాలన్నారు. అంతేకాక హెల్త్‌కార్డుల విధివిధానాలు ఖరారు చేయడంతో పాటు పాఠశాలల కుదింపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే, 2024 మార్చి నుంచి రిటైర్‌ అయిన 15 వేల మంది ఉద్యోగులతో పాటు సీపీఎస్‌ ఉపాధ్యాయుల డీఏ బకాయిలు విడుదల చేసి, సీపీఎస్‌ను రద్దు చేయాలని కోరారు. యంగ్‌ ఇండియా, టీపీఎస్‌ పేరుతో పాఠశాలలు కాకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉన్న పాఠశాలలల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు. సమావేశంలో నాయకులు గుగులోతు రామకృష్ణ, సద్దాబాబు, లక్ష్మణ్‌రావు, గోపాల్‌రావు, నర్సింహారావు, నిర్మల, సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement