ప్రకటనలకే ఉచిత ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

ప్రకటనలకే ఉచిత ప్రయాణం

Jun 22 2026 12:42 AM | Updated on Jun 22 2026 12:42 AM

‘నీట్‌’అభ్యర్థులకు నిరాశ

ఖమ్మంమయూరిసెంటర్‌: జిలాల్లో ఆదివారం జరిగిన నీట్‌ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయితే, సమన్వయ లోపమో, సమాచారం లేదో తెలియదు కానీ కొందరుడ్రైవర్ల తీరుతో విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. నీట్‌ రాసిన విద్యార్థులు కొందరు ఖమ్మం కొత్త బస్టాండ్‌లో సత్తుపల్లి వెళ్లే డీలక్స్‌ బస్సు ఎక్కారు. అయితే విద్యార్థుల వద్ద హాల్‌టికెట్లను చూసిన డ్రైవర్‌ అవి జిరాక్స్‌ కాపీలని చెబుతూ దిగాలని సూచించాడు. అవి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నవని చెప్పినా వినకుండా విద్యార్థులను బలవంతంగా దింపినట్లు తెలిసింది. ఈ విషయంపై సత్తుపల్లి డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన సూచనలతో కంట్రోలర్‌లను కలిసినా డ్రైవర్‌ వినకపోవడంతో విద్యార్థులు మరో బస్సులో చార్జీ చెల్లించి ప్రయాణించినట్లు సమాచారం. ఈ మేరకు సత్తుపల్లి డిపో మేనేజర్‌ లక్ష్మీనారాయణను వివరణ కోరగా.. విద్యార్థులు తనకు ఫోన్‌ చేయగా, కంట్రోలర్‌ను కలవమని చెప్పానని.. ఆ తర్వాత ఎవరు ఫోన్‌ చేయలేదని తెలిపారు.

దంత వైద్యులకు అవార్డు

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం గట్టయ్య సెంటర్‌ వీడీఓస్‌ కాలనీలోని శ్రీ శ్రీనివాసం డెంటల్‌ ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ మొరిశెట్టి ప్రదీప్‌ కుమార్‌, డాక్టర్‌ ఎం.ప్రియాంకలకు ‘‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ డెంటిస్ట్రీ’’ అవార్డు లభించింది. హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో టైమ్స్‌ నౌ నెట్‌వర్క్‌ నిర్వహించిన ఇండియన్‌ హెల్త్‌ సమ్మిట్‌–2026 లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.

గంజాయి స్వాధీనం

భద్రాచలంఅర్బన్‌: రెండు వేర్వేరు ఘటనల్లో ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న 9.7 కేజీల గంజాయిని పట్టణంలోని కూనవరం రోడ్డులో ఆదివారం ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ శ్రీహరిరావు కూనవరం రోడ్డులో వాహనాలు తనిఖీ చేపట్టారు. నంబర్‌ ప్లేట్‌ లేకుండా వస్తున్న స్కూటీ నీ ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 5.2 కేజీల గంజా యి దొరికింది. తరలిస్తున్న వారు హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ఖాన్‌, షేక్‌ షోయబ్‌గా తేలింది. మరో ఘటనలో స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద 4.5 కేజీల గంజాయి లభించింది. తరలిస్తున్న వారు మోహిత్‌కుమార్‌, ఆనంద్‌ మిశ్రాగా తేలింది. ఆనంద్‌ మిశ్రా పరారీలో ఉన్నాడని, పట్టుబడిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, గంజాయిని ఒడిశా రాష్ట్రం కలిమెల, మోటు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా దొరికారని, మొత్తం 9.7 కేజీల గంజాయి, రెండు స్కూటీలు, రెండు మొబైళ్లను సీజ్‌ చేశామని, గంజాయి విలువ రూ.6.60 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.

ఆటో, ద్విచక్రవాహనం ఢీ..

అశ్వారావుపేటరూరల్‌: ఆటో, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ముగ్గురుగాయపడ్డారు. స్థానికు లు, బంధువుల కథనం ప్రకారం.. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన భోగి నాగేశ్వరరావు (38), ఆయన భార్య వెంకటలక్ష్మి, బావమరిది మనుగొండ శ్రీను, ఆయన ఆరేళ్ల కూతురు పూరి కలిసి ద్విచక్రవాహనంపై ఆదివారం దమ్మపేట మండలం రంగువారిగూడెంలోని శ్రీముత్యాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చే క్రమంలో మండలంలోని నారంవారిగూడెంకాలనీ వద్ద ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీను కాలు, చేయి విరిగగా చిన్నారి పూరి కాలు విరిగింది. వెంకటలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement