బోనకల్: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ ఉద్దేశంతోనే బలమైన పునాదుల కోసం ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నట్లు ఇన్‌చార్జ్ డీఈఓ సదానందం తెలిపారు. బోనకల్ మండలం కలకోట పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగాన్ని శనివారం ప్రారంభించిన ఆయన విద్యార్థులకు కిట్లు అందజేశాక మాట్లాడారు. ప్రీ ప్రైమరీ విద్యావిధానం గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు గొప్ప అవకాశమని తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. సర్పంచ్ పైడిపల్లి అనిత, ఏఎంఓ ప్రభాకర్‌రావు, ఎంఈఓ దామాల పుల్లయ్య, హెచ్‌ఎం సునీల్‌కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
చింతకాని: యోగా సాధన ద్వారా ఆరోగ్యం సొంతమవుతుందని ఇన్‌చార్జ్ డీఈఓ సదానందం పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చింతకాని మండలం పందిళ్లపల్లి పాఠశాలలో ఆయన విద్యార్థులతో కలిసి యోగా చేశాక మాట్లాడారు. ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యంగా ఉండడమే కాక మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. సర్పంచ్ వత్సవాయి పద్మ, ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌ఎం దొండపాటి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ డీఈఓ సదానందం


