ప్రతిభకు పురస్కారం.. | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు పురస్కారం..

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: జాతీయస్థాయి రెడ్‌రిబ్బన్‌ క్విజ్‌ పోటీల్లో ప్రథమ స్థానం సాధించి ఖమ్మం కీర్తిని చాటిన 30వ డివిజన్‌కు చెందిన తురక దేవిశ్రీప్రసన్నకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో ఇటీవల గవర్నర్‌ సమక్షాన సీఎం రేవంత్‌రెడ్డి ఆమెకు జ్ఞాపిక, రూ.50 వేల నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రసన్న తల్లి లక్ష్మిని కుటుంబ పరిస్థితులపై వాకబు చేశారు. అయితే, తండ్రి లేని బిడ్డను రెక్కల కష్టంతో చదివిస్తున్నానని, ఉండడానికి ఇల్లు కూడా లేదని తెలుసుకున్న సీఎం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కేటాయించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆదేశించారు. దీంతో మంత్రి తుమ్మల శనివారం అధికారులతో చర్చించి వైఎస్సార్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిని లక్ష్మికి మంజూరు చేయించారు. ఈ మేరకు కేటాయించిన ఇంట్లో మంజూరు పత్రాన్ని కాంగ్రెస్‌ ఖమ్మం నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్చౌదరి ఆమెకు అందజేశారు. నాయకులు కోసూరు ప్రసాద్‌, బాణాల లక్ష్మణ్‌, నరాల నరేశ్‌, మోహన్‌నాయుడు, తోల రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం ఆదేశాలతో

నిరుపేద విద్యార్థిని కుటుంబానికి ఇల్లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement