నీట్‌ పేపర్‌ లీకేజీ బాధ్యత కేంద్రానిదే.. | - | Sakshi
Sakshi News home page

నీట్‌ పేపర్‌ లీకేజీ బాధ్యత కేంద్రానిదే..

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మంది విద్యార్థులను ఆవేదనకు గురిచేసిన కేంద్రానికి వ్యతిరేకంగా ‘స్టూడెంట్‌ వాయిస్‌’పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం ఖమ్మం సప్తపది ఫంక్షన్‌ హాల్‌లో జరిగే ‘మహిళా భేటీ’లో మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, నాయకులు గజ్జెల్లి వెంకన్న, కొత్తా సీతారాములు, సయ్యద్‌ గౌస్‌, పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య, జెర్రిపోతుల అంజనీకుమార్‌, బానోత్‌ వినోద, రేఖా భార్గవి, సుకన్య పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement