కూసుమంచి: జలవనరుల శాఖ ఉద్యోగులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని సీఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని పాలేరు రిజర్వాయర్‌ను శనివారం పరిశీలించిన ఆయన నీటి నిల్వలను పరిశీలించాక ఉద్యోగులతో మాట్లాడారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అంతేకాక నీటి వృథాను అరికడుతూ చివరి భూములకు సైతం సాగునీరు అందించడంపై దృష్టి సారించాలని తెలిపారు. ఇటీవల విధుల్లో చేరిన నూతన సిబ్బందికి వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం ఫాలింగ్ గేట్ల నిర్వహణపై సీఈ సూచనలు చేశారు.


