కారేపల్లి: కారేపల్లికి చెందిన ఒకరికి డెంగీ నిర్ధారణ అయింది. మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన మహిళ మణుగూరులో బంధువుల ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతూ వారం క్రితం వచ్చింది. ఆమె ఈనెల 16న కారేపల్లి పీహెచ్‌సీలో పరీక్ష చేయించుకోగా డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి ఎంపీడీఓ మల్లేల రవీంద్రప్రసాద్, వైద్యాధికారి బి.సురేశ్, సర్పంచ్ మేదరి టోనీవీరప్రతాప్, గ్రామ కార్యదర్శి నెహ్రూ, జీపీఓ బంఫర్ తదితరులు కాలనీకి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అంతేకాక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. అందరూ ఇళ్లలోనే కాక పరిసరాల పరిశభ్రత పాటించాలని, తద్వారా సీజనల్ వ్యాధులు దరిచేరవని తెలిపారు.


