ఎర్రుపాలెం: పేద విద్యార్థులకు మేలు చేసేలా విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఉండాలని పీఆర్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రంగారావు పేర్కొన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా మండలంలోని బనిగండ్లపాడు, మామునూరు, భీమవరం, రామన్నపాలెం, ఇనగాలి, మీనవోలు పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఉండాలని, ఇందుకోసం మేధావులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల అభిప్రాయాలు స్వీకరించాలని సూచించారు. అంతేకాక సీపీఎస్ రద్దు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛన్ అమలుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొగ్గుల మదన్‌మోహన్‌రెడ్డి, మారపాక బాబూరావు, నాయకులు జంగా గురునాథరెడ్డి, ఆర్.బ్రహ్మారెడ్డి, శెట్టిపల్లి సంగిరెడ్డి, వెల్లంకి నాగరాజు, చిన్నప్ప, రాఘవరావు, వెంకటరమణ, నరసింహారావు, గోపిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.


