దెందుకూరులో రైల్వే హద్దులపై సర్వే | - | Sakshi
Sakshi News home page

దెందుకూరులో రైల్వే హద్దులపై సర్వే

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

మధిర: మండలంలోని దెందుకూరు రెవెన్యూ పరిధిలో రైల్వే లైన్‌ సమీపాన రైతుల భూముల్లో శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. రైల్వే అధికారులు తమ పొలాల్లోకి వచ్చి అక్రమంగా హద్దు రాళ్లు పాతుతున్నారని రైతులు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా రైల్వే కాంట్రాక్టర్లు హద్దు రాళ్లు పాతే ప్రయత్నం చేయడంతో వారు అడ్డుకున్నారు. రైల్వే, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యాన సర్వే చేసి తమ భూముల్లో ఏర్పా టు చేసిన హద్దు రాళ్లను తొలగించడమే కాక 1965లో సేకరించిన భూములు మినహా మిగిలినవి అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండల సర్వేయర్‌ ఉషారాణి ఆధ్వర్యాన శుక్రవారం సర్వే చేశారు. అయితే, ఇటీవల సికింద్రాబాద్‌ డివిజన్‌ నుంచి విజయవాడ డివిజన్‌కు పరిపాలనా మార్పు జరగడంతో రైల్వే అధికారులు సర్వేకు హాజరుకాలేదు. త్వరలోనే మొత్తం సర్వే నంబర్లలో సర్వే చేయన్నుట్లు అధికారులు రైతులకు వివరించారు. రైతులు చుంచు విజయ్‌కుమార్‌, గుర్రం వెంకట్రావు, అద్దంకి భాస్కరరావు, ఐతం కృష్ణ, కోట శ్రీనివాసరావు, అద్దంకి వెంకట్రావు, ఊట్ల శంకర్‌ రావు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు, యడ్లపల్లి రామా రావు, ఊట్ల రఘు, చావా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement