గడువులోగా నిర్మాణాలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

గడువులోగా నిర్మాణాలు పూర్తి

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

గడువులోగా నిర్మాణాలు పూర్తి

ఖమ్మంరూరల్‌: అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలో రూ.108 కోట్లతో నిర్మిస్తున్న జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల పనులను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్ల భవనాలు, ప్రధాన భవనం, అకడమిక్‌ బ్లాక్‌ నిర్మాణాల పురోగతిపై ఆరా తీశాక అదనంగా కార్మికులను నియమించి పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆతర్వాత పొన్నేకల్‌లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల పనులను కూడా కలెక్టర్‌ పరిశీలించి సూచనలు చేశారు. విద్యాశాఖ ఇంజనీరింగ్‌ అధికారి బుగ్గయ్య, తహసీల్దార్‌ ఎం.వినయేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement