ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

ఖమ్మం సహకారనగర్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)పై ప్రత్యేక దృష్టి సారిస్తూ పొరపాట్లకు తావు లేకుండా విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 25నుంచి జూలై 24వ తేదీ వరకు బూత్‌ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించి, పూర్తిచేశాక సేకరించాలని తెలిపారు. జిల్లా నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించగా, ఉద్యోగులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ, కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, కల్లూరు సబ్‌ కలెక్టర్‌ అజయ్‌ యాదవ్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ సదానందం, ఖమ్మం ఆర్‌డీఓ శ్రీనివాస్‌, ఎన్నికల విభాగం ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.

ఓటర్లు సహకరించాలి

అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. రఘునాథపాలెంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్లతో మాట్లాడి సమస్యలు తెలుకున్నారు. అనంతరం ప్రతీ ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యాపింగ్‌ వేగంగా పూర్తిచేయాలని ఉద్యోగులకు సూచించారు. తహసీల్దార్‌ శ్వేత, సర్పంచ్‌ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement