కల్లూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి తెలిపారు. కల్లూరులోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయితో కలిసి ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ నియోజకవర్గానికి రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయాన క్రీడాకారులను ప్రోత్సహించేలా స్టేడియంలు, ఇతర వసతులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తొలుత కల్లూరులోని ఏరియా ఆస్పత్రికి సందర్శించి కావాల్సిన సౌకర్యాలపై ఎంపీ, ఎమ్మెల్యే ఆరా తీశారు. కాగా, కల్లూరు స్టేడియంలో స్విమ్మింగ్‌పూల్, వాకింగ్ ట్రాక్ మంజూరు చేయాలని క్రీడాకారులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ బాగం నీరజాదేవి, తహసీల్దార్ బ్రహ్మేశ్వరరావు, ఎంపీడీఓ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరి, కమిషనర్ సాయికృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శేఖర్, ఎంఈఓ పి.నివేదిత, కాంగ్రెస్ నాయకులు పోట్రు అర్జున్‌రావు, పసుమర్తి చందర్రావు, ఎస్.కే.ఉస్మాన్, పెద్దబోయిన శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి


