ఖమ్మంస్పోర్ట్స్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ అథ్లెటిక్స్ మీట్‌లో జిల్లా క్రీడాకారులు 14 పతకాలు సాధించారు. ఇందులో ఆరు బంగారు, ఐదు రజత, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారులు కె.మస్తాన్, డి.వివేక్‌చంద్ర, జి.వెంకట్‌సాయి, ఎస్‌కే మజీద్, బి.ప్రసన్న, బి.లోకేశ్, ఎండీ.అబ్దుల్ రజాక్, బి.బన్సీలాల్, ఎ.మైథిలి, బి.బిందు, దేవిప్రసాద్‌ను కలెక్టర్ దివాకర శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, అథ్లెటిక్స్ అకాడమీ చీఫ్ కోచ్ ఎండీ.గౌస్ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ లెర్నింగ్
తరగతులు ప్రారంభం
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే ‘అన్న అక్క’ మెంటార్‌షిప్ డిజిటల్ లెర్నింగ్ శిక్షణా తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి ఆధ్వర్యాన శిక్షణ ఏర్పాటు చేయగా, కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు హరిత పలు అంశాలపై అవగాహన కల్పించారు. వైస్ ప్రిన్సిపాల్ పీర్ సాహెబ్, నోడల్ టీచర్లు వీరారెడ్డి, సుభాషిణి, చెన్నారావు, విద్యార్థులు పాల్గొన్నారు.
అత్యాధునిక విధానాల్లో వైద్యం
ఖమ్మం మామిళ్లగూడెం: శ్వాసకోశ లేదా గుండె వైఫల్యంతో బాధపడుతున్న వారికి సోమాజిగూడ యశోద ఆస్పత్రుల్లో అత్యాధునిక విధానాల్లో చికిత్స చేస్తున్నట్లు క్రిటికల్ కేర్ సీనియర్ డాక్టర్ వై.సూర్య ప్రకాష్ తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎక్స్‌ట్రా కార్పొరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో) ద్వారా చికిత్స చేశామని చెప్పారు. సాధారణ చికిత్స సరిపోని పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడేందుకు ఎక్మో కీలకంగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీధర్‌రావు, పరమేశ్, నాగార్జున, బాలకృష్ణ పాల్గొన్నారు.
‘సింగరేణి కార్మికులారా జాగ్రత్త’
రుద్రంపూర్: గతంలో సింగరేణి నిధులు దోపిడీ చేసిన వారే మళ్లీ ఇతర రూపాల్లో వస్తున్నందున కార్మికులు అప్రమత్తంగా ఉండాలని బీఎంఎస్ జాతీయ నాయకుడు పి.మాధవనాయక్ సూచించారు. కొత్తగూడెంలోని కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి నియామకాల్లో అక్రమాలకు పాల్పడి గనులు దక్కకుండా అడ్డుపడ్డ వారు మళ్లీ మాయమాటలతో వస్తున్నందున కార్మికులు జాగ్రత్త వహించాలని కోరారు. కాగా, 11వ వేజ్‌బోర్డ్ కాలపరిమితి ముగియనున్నందున 12వ వేజ్‌బోర్డ్ జేబీసీసీ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. నాయకులు మోహన్, శ్రీనివాస్, అశోక్, బాలకృష్ణ, నరేష్, ఉదయ్, చంద్రశేఖర్, భీమా, వడ్డీకాసు, ఆత్రేయ, సుధాకర్, రాజేష్, చందర్, రాజమౌళి, నాగేశ్వరరావు, శేఖర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


