● గ్రాట్యూటీ, గృహ నిర్మాణ రుణాల శ్లాబ్‌లు పెంపు ● ఉపనయనం, వివాహసాయం, విద్యారుణాలు కూడా..
ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకులు, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ బోర్డు ద్వారా అందించే అన్ని రకాల సాయాలను పెంచుతూ కమిషనర్ ఎం.హన్మంతరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక రిటైర్‌మెంట్, మరణాంతర గ్రాట్యుటీలో కొత్త స్లాబ్‌లు ప్రవేశపెట్టారు. ఆలయ ఉద్యోగులు మొదలు అసిస్టెంట్ కమిషనర్ వరకు నూతన శ్లాబ్‌లు వర్తించనున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 280 మంది..
దేవాదాయ శాఖ పెంచిన సంక్షేమ సౌకర్యాలు ఉమ్మ డి జిల్లాలోని 86 ఆలయాల్లో పనిచేస్తున్న 280 మంది అర్చక, ఉద్యోగులకు వర్తిస్తాయి. ఇందులో ఉద్యోగు లు 175 మంది, అర్చకులు 105 మంది ఉన్నారు. ఈ మేరకు అర్చక, ఉద్యోగులు ఆయా పథకాల కోసం అసిస్టెంట్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని అర్చక, ఉద్యోగుల సంక్షేమ పథకాల స్లాబ్‌లను ప్రభుత్వం సవరించింది. కొత్త స్లాబ్‌ల ప్రకారం మరింత మెరుగైన ప్రయోజనాలు అందుతాయి. అవసరమైన వారు దరఖాస్తులను ఖమ్మంలోని మా కార్యాలయంలో అందజేయాలి.
–మేకల వీరస్వామి,
అసిస్టెంట్ కమిషనర్, ఉమ్మడి జిల్లా


