●‘ఆమె’కు మాట సాయమట! | - | Sakshi
Sakshi News home page

●‘ఆమె’కు మాట సాయమట!

Jun 20 2026 12:07 AM | Updated on Jun 20 2026 12:07 AM

వైరా మున్సిపాలిటీకి ఇటీవల కొత్త పాలకవర్గం కొలువుదీరగా.. శుక్రవారం కౌన్సిల్‌ రెండో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2, 4, 13వ మహిళా కౌన్సిలర్ల భర్తలు కూడా సమావేశానికి హాజరై వెనుకాల కూర్చున్నారు. ఓ పక్క చర్చ జరుగుతుండగా వీరు కౌన్సిలర్లకు ఫోన్‌లో ఏమేం మాట్లాడాలో సూచనలు ఇవ్వడం కనిపించింది. కౌన్సిలర్లే కాదు ఏకంగా చైర్‌పర్సన్‌ భర్త కూడా మిగతా కౌన్సిలర్ల భర్తలతో పాటు కూర్చుని సమావేశాన్ని పర్యవేక్షించడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా సమావేశాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులను మాత్రం బయటకు వెళ్లాలని కమిషనర్‌ ఆదేశించడం కొసమెరుపు ! – వైరా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement