స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యాన ఓటర్లలో అపోహలు తొలగించడంతో పాటు విస్తృత అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈమేరకు జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడమే కాక కరపత్రాలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి సామగ్రి కలెక్టరేట్‌కు చేరగా, మండలాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్
ఖమ్మంవ్యవసాయం: ప్రైవేట్ విద్యాసంస్థల ప్రాంగణాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అంశంపై గురువారం ఖమ్మం ఎస్‌ఈ శ్రీనివాసాచారి సమీక్షించారు. ఈమేరకు ఖమ్మంలో అధికారులతో సమావేశమైన ఆయన ప్రభుత్వ విద్యాసంస్థలు కొనసాగుతున్న భవనాల సర్వీసులను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. తద్వారా ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి ముజాహిద్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.
విద్యుత్ లైన్ల పునరుద్ధరణ
ఈదురుగాలులు, అకాల వర్షంతో దెబ్బతిన్న విద్యుత్ లైన్లను మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసాచారి తెలిపారు. కలెక్టర్ దివాకర ఆదేశాలతో పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని పేర్కొన్నారు. ఇంకొన్ని చోట్ల ప్రత్యామ్నాయ లైన్ల ద్వారా సరఫరా చేసినట్లు వెల్లడించారు.


