అనుమతి లేని మిర్చి విత్తనాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

అనుమతి లేని మిర్చి విత్తనాలు స్వాధీనం

Jun 19 2026 12:30 AM | Updated on Jun 19 2026 12:30 AM

కామేపల్లి: అనుమతి లేకుండా మిరప విత్తన ప్యాకెట్లను గ్రామాల్లో విక్రయిస్తుండగా వ్యవసాయ, పోలీసు ఉద్యోగులు సంయుక్త తనిఖీల్లో గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఎన్‌టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన ఉప్పుటూరి వెంకటప్పారావు కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన జాలే శ్రీనుయాదవ్‌ కలిసి గ్రామంలో మిర్చి విత్తన ప్యాకెట్లను అధిక ధరకు విక్రయిస్తున్నారని సమాచారం అందింది. దీంతో గ్రామానికి చేరుకున్న అధికారులు విత్తన ప్యాకెట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, జాలె శ్రీను తనకు విత్తన దుకాణం ఉందని, అధిక ధరకు విత్తనాలు విక్రయించి డబ్బు సంపాదించొచ్చని చెప్పడంతో బిల్లులు లేకుండా అమ్ముతున్నానని వెంకటప్పారావు విచారణలో అంగీకరించాడు. కాగా, ఏఓ తారాదేవి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేయగా, వీరి నుంచి స్వాధీనం చేసుకున్న విత్తనాల విలువ రూ.60,276 ఉంటుందని వెల్లడించారు.

ఏపీ నుంచి తీసుకొచ్చి అమ్ముతున్న వ్యాపారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement