గాలివానకు కూలిన చెట్ల కొమ్మలు | - | Sakshi
Sakshi News home page

గాలివానకు కూలిన చెట్ల కొమ్మలు

Jun 18 2026 12:11 AM | Updated on Jun 18 2026 12:11 AM

తల్లాడ: మండలంలో బుధవారం సాయంత్రం వచ్చిన గాలి వానకు చెట్ల కొమ్మలు విరిగి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మండలంలోని నరసింహారావుపేట – గార్లొడ్డు గ్రామాల మధ్య రెండు చోట్ల భారీ వృక్షాలకు చెందిన కొమ్మలు విరిగి రోడ్డుపై పడ్డాయి. అలాగే, రంగంబంజర వద్ద జాతీయ రహదారిపై చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది. రంగంబంజరలో ధర్మసోత్‌ దశరథ్‌నాయక్‌, ఈలప్రోలు భాస్కర్‌రావు, మడిపల్లి బాస్కర్‌రావు రోడ్డుకు అడ్డంగా పడిన చెట్ల కొమ్మలను తొలగించారు. నరసింహారావుపేట వద్ద విరిగిన కొమ్మలను జేసీబీ సాయంతో తొలగించారు. గాలి వానకు మండలంలోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు రేకులు కూడా ఎగిరిపోయాయి.

కొత్తగూడెం, సత్తుపల్లి రహదారుల్లో

ట్రాఫిక్‌కు అంతరాయం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement