21న కాంగ్రెస్‌ ‘నారీ భేటీ’ | - | Sakshi
Sakshi News home page

21న కాంగ్రెస్‌ ‘నారీ భేటీ’

Jun 18 2026 12:11 AM | Updated on Jun 18 2026 12:11 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్‌హాల్‌లో ఈ నెల 21న నిర్వహించే నారీ భేటీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌, కాంగ్రెస్‌ మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం వారు పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 21న మధ్యాహ్నం 2 గంటలకు మొదలయ్యే నారీ భేటీ సమావేశానికి మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరుకానున్న నేపథ్యాన జిల్లాలోని మహిళా కార్యకర్త లు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దామా స్వరూప, బలుసు లక్ష్మి, ఊరుకొండ చంద్రిక, రేఖా భార్గవి, గోవిందమ్మ, మంగ, బొడ్డు బొందయ్య, కిలారు అనిల్‌కుమార్‌, కొట్టే రాజశేఖర్‌, మద్దినేని రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

తల్లాడ: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల ఆరోగ్యంపై ఉద్యోగులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పంచాయతీ అధికారి టి. రాంబాబు సూచించారు. తల్లాడ మండలం కుర్నవల్లికి చెందిన జోజి జ్వరంతో బాధపడుతూ మృతి చెందగా బుధవారం గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ సందర్భంగా డీపీఓ పరిశీలించి మాట్లాడుతూ వర్షాకాలంలో స్థానికులు ఇళ్లలోనే కాకుండా పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సీజనల్‌ వ్యాధులు దరి చేరవని తెలిపారు. అలాగే, గ్రామంలో మండల వైద్యాధికారి ప్రత్యూష ఆధ్వర్యాన వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా జ్వర సర్వే చేపట్టగా రెండు జ్వరం కేసులు నమోదయ్యా యి. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీధర్‌రాజు, సర్పంచ్‌ ఎక్కిరాల శేషమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ యూనివర్సిటీ నోడల్‌ ఆఫీసర్‌గా ఆదర్శ్‌కుమార్‌

ఖమ్మంస్పోర్ట్స్‌: హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ప్రచారం కోసం జిల్లా నోడల్‌ ఆఫీసర్‌గా కె.ఆదర్శ్‌కుమార్‌ను నియమించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యా యి. జిల్లాలోని ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో చేర్పించేలా పర్యవేక్షించేందుకు నోడల్‌ అధికారిని నియమించారు. ఈ సందర్భంగా ఆదర్శ్‌కుమార్‌ను పలు క్రీడా సంఘాల బాధ్యులు అభినందించారు.

నేడు సర్టిఫికెట్ల

పరిశీలన

ఖమ్మంసహకారనగర్‌: ప్రభుత్వ, ప్రైవేట్‌ డీఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌), డీఎల్‌ ఈడీ (డిప్లొమా ఇన్‌ ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌) కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ఖమ్మం డైట్‌లో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్‌, ప్రిన్సిపాల్‌ బాలమురళి తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం deecet. cdse. telangana ద్వారా ఈ నెల 19, 20వ తేదీల్లో అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. ఆపై ఆప్షన్ల సవరణకు ఈ నెల 21వ తేదీన అవకాశం ఉండగా, సీట్ల కేటాయింపు 25న జరుగుతుందని తెలిపారు. ఆయా అభ్యర్థులు 25 నుంచి 27వ తేదీలోగా ట్యూషన్‌ ఫీజు చెల్లించి కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు. కాగా, మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు కూడా స్లైడింగ్‌ ఆప్షన్‌ ద్వారా ఇతర కళాశాలలకు మారే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఖబరస్థాన్‌లో

భారీ శబ్దంతో పిడుగు

ఖమ్మంరూరల్‌: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి వరంగల్‌ క్రాస్‌లోని ఖబరస్థాన్‌లో బుధవారం రాత్రి భారీ శబ్దంతో పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమవగానే కొద్దిసేపటికే పిడుగు పడడంతో సమీపంలోని నివాసితులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. కాగా, పిడుగుపాటుకు ఖబరస్థాన్‌లోని కొబ్బరి చెట్లకు మంటలు అంటుకుని కాలిపోయాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement