ఖమ్మంమామిళ్లగూడెం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యాన పన్నెండేళ్లలో దేశం గతంలో లేనివిధంగా అభివృద్ధిలో దూసుకెళ్తోందని బీజేపీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో 12 ఏళ్లలో అమలైన పథకాల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేయగా, బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు నిధులు కేటాయించిందని తెలిపారు. అయితే గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతితో భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తోందన్నారు. అంతేకాక వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
హైవేపై ఎగ్జిట్ మంజూరు చేయించా..
వేంసూరు: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవే మార్గంలో వేంసూరు వద్ద ఎగ్జిట్ తాను ప్రత్యేక చొరవతో మంజూరు చేయించాలని బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించి 12ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేంసూరు ఎగ్జిట్ వద్ద స్థానిక నాయకులతో కలిసి ఆయన 12 మొక్కలు నాటి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తే కాంగ్రెస్ నేతలు వారి ఘనతగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు, నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, నాయకులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, మేకల నాగేందర్, నున్నా రవి, సరస్వతి, అనిత, నకిరకంటి వీరభద్రం, శ్యామ్‌రాథోడ్, లక్ష్మీనారాయణ, రవిగౌడ్, భాస్కర్ణి వీరంరాజు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి


