గడువులోగా దరఖాస్తుల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గడువులోగా దరఖాస్తుల పరిష్కారం

Jun 18 2026 12:11 AM | Updated on Jun 18 2026 12:11 AM

ఖమ్మం అర్బన్‌: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే యువతను ప్రోత్సహించేలా టీజీ–ఐపాస్‌ ద్వారా అందిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన టీజీ–ఐపాస్‌ కమిటీ సమావేశంలో అనుమతులు, టీ–ప్రైడ్‌ అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 12 ఎస్సీ, 13 ఎస్టీ యూనిట్లకు రూ.1.35కోట్లకు పైగా పెట్టుబడి సబ్సిడీ మంజూరైందని తెలిపారు. అలాగే, పావలా వడ్డీ కింద ఒక ఎస్టీ యూనిట్‌కు రూ.46,374 సబ్సిడీ అందించామన్నారు. ఈసమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ప్రవీణ్‌కుమార్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రవిప్రసాద్‌, ఆర్‌టీఓ శ్రీనివాసరావు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు ముజాహిద్‌, విజయలక్ష్మి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, జిల్లా ఉపాధికల్పన అధికారి మాధవి, పరిశ్రమల శాఖ ఏడీ నకుల్‌ రెడ్డి పాల్గొన్నారు.

ఎన్‌ఏటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి

నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌(ఎన్‌ఏటీఎస్‌ 2.0)ను యువత సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌లో పాలిటెక్నిక్‌, డిగ్రీ విద్యార్థులు, సంస్థలు భాగస్వాములు కావాలన్నారు. ఎన్‌ఏటీఎస్‌ పోర్టల్‌ ద్వారా సంస్థలు ఖాళీలను ప్రకటిస్తున్నందున ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

వంద శాతం ఓటరు మ్యాపింగ్‌

జిల్లాలో ఓటరు మ్యాపింగ్‌ ప్రక్రియ వంద శాతం చేపట్టాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. కలెక్టరేట్‌ వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ఈనెల 25నుంచి మొదలుకానున్నందున పార్టీల నాయకులు పోలింగ్‌ కేంద్రాలకు బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించాలని తెలిపారు. వీరు బూత్‌ స్థాయి అధికారులతో ఇంటింటి ఎన్యుమరేషన్‌లో పాల్గొనాలని సూచించారు. ఓటరు మ్యాపింగ్‌ కాని వారు 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి అందించేలా ముందస్తు అవగాహన కల్పించాలని తెలిపారు. మ్యాపింగ్‌ అయిన వారు మాత్రం ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈసమావేశంలో కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, ట్రెయినీ కలెక్టర్‌ పారస్‌ కుమార్‌, ఆర్‌డీఓ శ్రీనివాస్‌, ఎస్‌డీసీ సదానందం, ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement