ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ ప్రారంభమైంది. వానాకాలం పంటల సాగుకు అవసరమైన యూరియాను రైతులకు ఈ యాప్ ద్వారా అందించనున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే ఇచ్చే యూరియా వినియోగం పెరగడం, ఇదే సమయాన కొరత ఏర్పడడంతో గత సీజన్‌లో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈనేపథ్యాన ఎరువు పక్కదారి పట్టకుండా యాప్‌ను గత యాసంగి సీజన్ నుంచి అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 2.80 లక్షల బస్తాలు, భద్రాద్రి జిల్లాలో 1.07 లక్షల బస్తాల యూరియా అందుబాటులో ఉంది. ఈ యూరియా కోసం సెల్‌ఫోన్ల ద్వారా లేక ఏఈఓల ద్వారా బుక్ చేసుకుంటే ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు సరఫరా చేయనున్నారు.
ఒక్కో రైతుకు
రెండు బస్తాల చొప్పున సరఫరా


