సత్తుపల్లిరూరల్: సింగరేణి సత్తుపల్లి ఏరియాలోని గనుల్లో భద్రత, కార్మికుల ఆరోగ్య ప్రమాణాల పరిశీలనకు డీఎంఎస్ డాక్టర్ ఐ.సత్యనారాయణ మంగళవారం పర్యటించారు. కొత్తగూడెం రీజియన్ జీఎం (సేఫ్టీ) కృష్ణగోపాల్ తివారీతో కలిసి ఆయన జేవీఆర్‌ఓసీలో తనిఖీ చేశారు. బొగ్గు ఉత్పత్తి ప్రాంతాల్లో సేఫ్టీ మాక్ డ్రిల్ నిర్వహించారు. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఉద్యోగులు, కార్మికులకు అవగాహన కల్పించారు. బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల రక్షణ, ఆరోగ్యం సింగరేణికి ముఖ్యమని ఈ సందర్భంగా డీఎంఎస్ పేర్కొన్నారు. అనంతరం డీఎంఎస్‌ను ఏరియా అధికారులు సన్మానించారు. కార్యక్రమంలో పీఓలు ఎన్‌వీఆర్ ప్రహ్లాద్, సునీల్‌వర్మ, పలు విభాగాల అధికారులు బొల్లం శ్రీనివాస్, కె.సోమశేఖర్, బి.శ్రీనివాసరావు, జీవీ రావు, బి.రాజేశ్వరరావు, బి.రామకృష్ణ, జి.కల్యాణ్‌రామ్, గోవింద్, కావ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


