ప్రజాదర్బార్‌లో వచ్చిన దరఖాస్తుల్లో తక్షణం పరిష్కరించే స్థితిలో ఉన్న వాటికి వెంటనే మోక్షం లభిస్తోంది. నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరులో ఓవర్‌లోడ్ కారణంగా లోవోల్టేజీ సమస్య ఎదురవుతోంది. దీనిపై బోడులబండలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ మంత్రి పొంగులేటికి దరఖాస్తు ఇచ్చారు. దీంతో ఆయన ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఆదేశించగా.. విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్‌ఫార్మర్ అమర్చారు. దీంతో గ్రామంలో దాదాపు 200 గృహాలకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందుతుండగా గ్రామస్తులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.


