ఖమ్మం సహకారనగర్: జిల్లాలో అటవీ – రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్‌తో కలిసి మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. రెవెన్యూ, అటవీ భూమి సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. జాయింట్ సర్వే సమయాన సమావేశమై ప్రణాళిక రూపొందించుకుంటే ఫలితం ఉంటుందని చెప్పారు. ఆతర్వాత ఆర్‌ఎఫ్‌ఆర్ పట్టా భూముల్లో సమస్యలు, బోర్ల మంజూరు, అటవీ భూముల ఆక్రమణల కట్టడిపై సమీక్షించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ట్రెయినీ కలెక్టర్ పారస్ కుమార్, డీఆర్వో సీహెచ్.రామ్మూర్తి, ఆర్‌డీఓ శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.


