కొనసాగిన భానుడి ప్రతాపం | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన భానుడి ప్రతాపం

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మంగళవారం ఎండ ప్రభావం కొనసాగింది. జిల్లాలో సగటున 39.4 నుంచి 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. గరిష్టంగా బచ్చోడులో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, చింతకానిలో 42.7, గుబ్బగుర్తిలో 42.6, కలెక్టరేట్‌ వద్ద 42.5, పమ్మి, తిమ్మారావుపేట, కాకరవాయిలో 42.2, ముదిగొండ, బాణాపురం, ఎర్రుపాలెంలో 41.9, పెద్దగోపతి, పల్లెగూడెంలో 41.8, నాగులవంచ, లింగాల, సిరిపురం, ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్‌హౌస్‌ వద్ద 41.6, వైరా, తల్లాడలో 41.5, ఖానాపురంలో 41.4, ప్రకాష్‌నగర్‌, నేలకొండపలి, కొణిజర్ల్ల, పంగిడిలో 41.3, కుర్నవల్లి, సత్తుపల్లిలో 41.2, ఏన్కూరు, మధిరలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. జూన్‌ మూడో వారం వచ్చినా ఎండలు తగ్గకపోగా, వర్షాల జాడ లేకపోవడంతో జనం ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement