పెనుబల్లి: అస్వస్థతకు గురైన లారీడ్రైవర్ ఎల్లయ్య (65) క్యాబిన్‌లోనే మృతి చెందిన ఘట న మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రీన్ ఫీల్డ్ హైవేపై లారీ నడుపుతున్న డ్రైవర్ ఎల్లయ్య మండలంలోని ముత్తగూడెం వద్దకు చేరుకోగానే అస్వస్థతకు గురై పక్కకు నిలిపాడు. ఆపై పరిస్థితి విషమించడంతో ఆయన క్యాబిన్‌లోనే మృతిచెందాడు. కాగా, ఆయన వద్ద ఆధారాలను పరిశీలించి మృతుడు సిద్దిపేట జిల్లా గణేశ్‌నగర్ వాసిగా గుర్తించినట్లు వీఎం బంజర్ పోలీసులు తెలిపారు.
డెంగీతో ఒకరు..
తల్లాడ: మండలంలోని కుర్నవల్లికి చెందిన ఓ వ్యక్తి (45) డెంగీతో బాధపడుతూ మంగళవారం మృతి చెందాడు. కొంతకాలంగా లివర్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను గత నెల 18న ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ నెల 1వ తేదీన ఆయనకు డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆపై పరిస్థితి విషమించి మృతి చెందాడు. సమాచారం తెలియడంతో మండల వైద్యాధికారి ప్రత్యూష, ఎంపీడీఓ శ్రీధర్‌రాజు కుర్నవల్లి గ్రామాన్ని సందర్శించి శానిటేషన్ చేయించడంతో పాటు ఇంటింటా ఫీవర్ సర్వే చేపట్టారు.


