ఈ నెల 26 నుంచి పశువులకు టీకాలు | - | Sakshi
Sakshi News home page

ఈ నెల 26 నుంచి పశువులకు టీకాలు

Jun 17 2026 12:10 AM | Updated on Jun 17 2026 12:10 AM

ఏన్కూరు: పశువుల్లో ముద్దచర్మ వ్యాధి నివారణ కోసం ఈ నెల 26 నుంచి జూలై 8వ తేదీ వరకు టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి పురంధర్‌ తెలిపారు. ఏన్కూరులో మంగళవారం నిర్వహించిన పశు వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. గురక, జబ్బవ్యాధి నివారణ వ్యా క్సినేషన్‌ ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు రైతు తమ పశువులకు వ్యాక్సిన్లు వేయించాలని సూచించారు. మండల పశువైద్యాధికారి ఉపేందర్‌, ఉద్యోగులు సుధాకర్‌, నర్సింహారావు పాల్గొన్నారు.

ఓటర్ల మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయాలి

కారేపల్లి: 2002 జాబితాతో ప్రస్తుత ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ త్వరగా పూర్తి చేయడమే కాక ఈనెల 25వ తేదీ నుంచి ఇంటింటి సర్వేకు ఉద్యోగులు సిద్ధం కావాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ సూచించారు. కారేపల్లిలో మంగళవారం బీఎల్‌ఓలతో పాటు పార్టీల బీఎల్‌ఏలు, సర్పంచ్‌లతో ఎస్‌ఐఆర్‌(ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ)పై అవగాహన, శిక్షణ శిబిరం ఏర్పాటుచేశారు. తొలుత ఉద్యోగులతో సమావేశమైన అదనపు కలెక్టర్‌ ఇప్పటి వరకు పూర్తయిన మ్యాపింగ్‌పై ఆరా తీశాక మిగతా వారిని విభాగాల వారీగా విభజించిఇంటింటికి సర్వే సమయాన ఎన్యుమరేషన్‌ ఫామ్‌లు సేకరించాలని ఆదేశించారు. ఈవిషయంలో పార్టీల బీఎల్‌ఏలు, సర్పంచ్‌లు ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. సింగరేణి తహసీల్దార్‌ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్‌చార్జి ఎంపీడీఓ మల్లేల రవీంద్రప్రసాద్‌, సర్పంచ్‌లు మేదరి టోనీవీరప్రతాప్‌, భూక్యా రంజిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

బీఎల్‌ఓలు సర్పంచ్‌లతో సమావేశంలో

అదనపు కలెక్టర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement