ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 300 మంది దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బానోత్ బాలాజీ నాయక్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రబ్బానీ, జిల్లా ఆర్టీఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న, అనుబంధ సంఘాల అధ్యక్షుడు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, వేజండ్ల సాయి కుమార్, మొక్క శేఖర్ గౌడ్, బొడ్డు బొందయ్య, పుచ్చకాయల వీరభద్రం, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, డీసీసీ ప్రధాన కార్యదర్శులు కిలారు అనిల్ కుమార్, పట్టాభి, వెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్లు వెంకటేశ్వరరావు, బాలగంగాధర్ తిలక్, బచ్చలికూర నాగరాజు, అంజనీ కుమార్ పాల్గొన్నారు.
నేలకొండపల్లి: మండల కేంద్రంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజిని ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు.కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు, కార్యదర్శి రేగూరి వాసవి, దోసపాటి శేఖర్, వంగవీటి నాగేశ్వరరావు, జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేష్, గండు సైదులు, పసుపులేటి ఉపేందర్, చెరుకు రంగయ్య, రాయపూడి రోహిత్, పెద్ధపాక ముత్తయ్య,సైదా, లాల్, పాషా, సందీఫ్, బచ్చలకూరి నాగేశ్వరరావు ఉన్నారు.
తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం సీహెచ్‌సీకి తీసుకొచ్చిన వృద్ధుడికి నిర్లక్ష్యంగా చికిత్స చేయడంతో యూరిన్ బ్లాడర్ దెబ్బతిని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని అందిన ఫిర్యాదుతో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆస్పత్రిలో డీసీహెచ్‌ఓ డాక్టర్ రాజశేఖర్‌గౌడ్ విచారించారు. తాజాగా సోమవారం కల్లూరి ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ రమేష్ సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా తూమాటి కాంతయ్యకు వైద్యం చేసిన డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. అయితే, కాంతయ్య కుటుంబీకులకు కూడా సమాచారం ఇచ్చినా విచారణకు హాజరుకాలేదని తెలిపారు.
నేలకొండపల్లి: క్రికెట్ బంతి తీసేందుకు వెళ్లిన సమయాన ప్రహరీ కూలడంతో ఓ విద్యార్థి తీవ్రంగాగాయపడ్డాడు. మండలంలోని రాజేశ్వరపురానికి చెందిన బత్తిని వరుణ్ స్థానిక మిల్లు సమీపాన సోమవారం మరికొందరితో క్రికెట్ ఆడుతున్నారు. ఈ సమయంలో బాల్ దూరంగా ప్రహరీ అవతల పడడంతో తీసుకొచ్చేందుకు ముగ్గురు వెళ్లారు. ఇందులో వరుణ్ గోడ పైనుంచి వంగి బాల్‌ను తీసే క్రమాన అది కూలడంతో ఆయన ఓ చెవి తెగిపోవడంతో పాటు కింద వరుస పళ్లు ఊడిపోయాయి. అంతేకాక కాళ్లు విరగగా 108 సిబ్బంది నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు.
ఖమ్మంమయూరిసెంటర్: నగరంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సహకరించాలని కేఎంసీ కమిషనర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అభిషేక్ అగస్త్య అన్నారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 20 వరకు బూత్ లెవల్ ఆఫీసర్లు, ఏజెంట్లు, సంబంధిత ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.
కామేపల్లి: మొక్కజొన్న కొనుగోలులో ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయడంతో పాటు నగదు జమ కావడంపై మండలంలోని కొండాయిగూడెం సొసైటీ పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ ధనియాకుల హన్మంతరావు, సీఈఓ దొడ్డా ముత్తయ్యను సత్కరించారు. ధనియాకుల మాధవరావు, వీరభద్రరావు, శ్రీనివాసరావు, దుద్దుకూరి నవీన్, గొడుగు కొరివిలు, వీరన్న, నాగరాజు ఉన్నారు.
వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలి
ఖమ్మం మామిళ్లగూడెం: వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సీపీఎంఎల్ మాస్ లైన్ నాయకులు ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం సీహెచ్.శిరోమణి అధ్యక్షతన స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆరోగ్యశ్రీకి ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించాలన్నారు. ఝాన్సీ, శ్రీనివాస్, శోభ, తేజ నాయక్, ఎన్‌రాకేష్, భరత్, లక్ష్మణ్, రామనాథం, పాపారావు ఉన్నారు.


