తొమ్మిది నెలల తర్వాత కుటుంబం చెంతకు.. | - | Sakshi
Sakshi News home page

తొమ్మిది నెలల తర్వాత కుటుంబం చెంతకు..

Jun 3 2026 12:27 AM | Updated on Jun 3 2026 12:27 AM

ఖమ్మంఅర్బన్‌: మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని చేరదీసి సపర్యలు చేయడమే కాక కాస్త కోలుకున్నాక వివరాలు ఆరా తీసి కుటుంబం చెంతకు చేర్చిన ఖమ్మంకు చెందిన అన్నం సేవా ఫౌండేషన్‌ సభ్యులు అభినందనలు అందుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌ 25న ఖమ్మం టేకులపల్లి బైపాస్‌ వద్ద 40 ఏళ్ల మతిస్థిమితం లేని వ్యక్తి తిరుగుతుండగా అన్నం సేవా ఫౌండేషన్‌కు తీసుకొచ్చారు. ఆయనకు చికిత్స చేయిస్తుండగా ఇటీవల కోలుకోవడంతో తన పేరు కన్హీరామ్‌ యాదవ్‌ అని, తమ స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లా సన్వర్‌ గ్రామమని చెప్పాడు. ఈ మేరకు ఫౌండేషన్‌ సభ్యులు ఆయనను ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్‌ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి వివరాలు అందించగా, పోలీసులు సన్వర్‌ సర్పంచ్‌ను సంప్రదించడంతో కుటుంబీకుల ద్వారా కన్హీరామ్‌గా నిర్ధారించారు. దీంతో ఆయన సోదరులకు పోలీసుల సమక్షాన అప్పగించారు. తొమ్మిది నెలల తర్వాత క్షేమంగా చేర్చిన అన్నం ఫౌండేషన్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

జగదల్‌పూర్‌లో అప్పగించిన ‘అన్నం’బృందం

Advertisement
 
Advertisement
Advertisement