ఎందరో మహానుభావులు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, బ్యాంకులు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ పతాకాలు, పార్టీ జెండాలను ఎగరవేశారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులను స్మరించుకుని అంబేడ్కర్, గాంధీజీ చిత్రపటాలకు నివాళులర్పించారు. అమరుల ఆకాంక్షలను ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని, తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. పలు పాఠశాలల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించారు. – సాక్షి నెట్‌వర్క్


