కేఎంసీ బడ్జెట్...
● మంచి సంస్కరణలు తీసుకొచ్చారు.. ● పాలకవర్గం, అధికారులకు కలెక్టర్ అనుదీప్ అభినందన ● మెరుగైన సేవలు అందిస్తున్నామన్న మేయర్ నీరజ
ఖమ్మం మయూరిసెంటర్: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖమ్మం నగర పాలకసంస్థ అంచనా బడ్జెట్‌ను రూ.196.40 కోట్లతో ప్రవేశపెట్టారు. కేఎంసీ కౌన్సిల్ హాల్‌లో మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన బడ్జెట్, కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. తొలుత అకౌంట్స్ ఆఫీసర్ చింతా శ్రీనివాసరెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, ఆదాయ, ఖర్చుల వివరాలను వెల్లడించారు. రూ.196.40 కోట్ల ఆదాయం అంచనా వేయగా, అదే స్థాయిలో వ్యయం ఉంటాయని వెల్లడించారు. అనంతరం మేయర్ నీరజ మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
మెరుగైన సేవలే లక్ష్యం
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత ప్రధానమైన ఖమ్మం కార్పొరేషన్‌కు రూ.196 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ నిధులతో నగరవాసులకు మెరుగైన సేవలు అందేలా పనులు చేపట్టాలని వెల్లడించారు. కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మంచి సంస్కరణలు తీసుకొచ్చి చాలా సమస్యలు పరిష్కరించారని అభినందించారు. అయితే, కార్పొరేషన్‌కు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు.
పలు అంశాలకు ఆమోదం
బడ్జెట్ సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై సీపీఐ కార్పొరేటర్ బీజీ.క్లెమెంట్, బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధానాలనే ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని క్లెమెంట్ విమర్శించారు. గత సమావేశంలో పంపు ఆపరేటర్లను మున్సిపల్ కార్మికులుగా గుర్తిస్తూ చేసిన తీర్మానాన్ని అమలుచేయాలని క్లెమెంట్ పట్టుబట్టడంతో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. అలాగే, సారధినగర్ ఆర్‌యూబీకి కౌటూరి దుర్గాప్రసాద్ వారధిగా నామకరణం చేయాలన్న కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వర్లు ప్రతిపాదనను ఆమోదించారు. ఆతర్వాత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారిపై చర్యలు తీసుకోవాలని కొందరు కార్పొరేటర్లు కమిషనర్‌కు లేఖనుఅందజేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
కోట్లు
రూ.


