సబ్‌స్టేషన్‌ పనులు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సబ్‌స్టేషన్‌ పనులు పరిశీలన

Mar 18 2026 11:17 AM | Updated on Mar 18 2026 11:17 AM

బోనకల్‌: మండలంలోని చిరునోముల, బ్రాహ్మణపల్లిల్లో విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణ పనులను ఎన్పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ రాజుచౌహాన్‌ మంగళవారం పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలో అధికారులతో సమావేశమైన ఆయన పలు సూచనలు చేశారు. సబ్‌స్టేషన్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా నిరంతరం పరిశీలంచాలని ఆదేశించారు. ఆతర్వాత విద్యుత్‌ సామర్ధ్యం మెరుగుదల, సాంకేతిక అంశాలపై సూచనలు చేశారు. ఆతర్వాత మండలంలోని పలు గ్రామాల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల పనులను కూడా సీఈ పరిశీలించారు. ఖమ్మం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఈ.శ్రీనివాసాచారి, డివిజినల్‌ ఇంజనీర్లు భద్రూపవార్‌, డి.శ్రీనివాసరావు, ఏడీఈ వై.వీ.ఆనంద్‌కుమార్‌, ఏఈ టి.మనోహర్‌, సబ్‌ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement