జ్యుడీషియల్‌ ఉద్యోగుల ఉపాధ్యక్షుడిగా ప్రేమ్‌ | - | Sakshi
Sakshi News home page

జ్యుడీషియల్‌ ఉద్యోగుల ఉపాధ్యక్షుడిగా ప్రేమ్‌

Mar 18 2026 11:17 AM | Updated on Mar 18 2026 11:17 AM

ఖమ్మం లీగల్‌: ఇండియా జ్యుడీషియల్‌ ఎంప్లాయీస్‌ కాన్ఫిడరేషన్‌ ఉపాధ్యక్షుడిగా ఖమ్మంకు చెందిన దండి ప్రేమ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర న్యాయ ఉద్యోగుల సంఘానికి అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో జిల్లా న్యాయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ప్రేమ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ కూకట్‌పపల్లి కోర్టులో చీఫ్‌ అడ్మిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు జాతీయ కమిటీలో స్థానం లభించడంపై న్యాయ శాఖ ఉద్యోగులు అభినందించారు.

సొమ్ము పక్కదారిపై ఆందోళన

వైరా: రుణం వాయిదాలు బ్యాంకులో జమ చేయాలని ఇస్తే పక్క దారి పట్టించారని మహిళా సంఘం సభ్యులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈమేరకు వైరా మెప్మా కార్యాలయంలో ఫిర్యాదు చేయడ మే కాక డబ్బు వాడుకుని మోసం చేసిందని గ్రామదీపికను నిలదీయంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలిసి పోలీసులు చేరుకుని సర్దిచెప్పారు. ఆనంతరం మెప్మా అధికారి వెంకటేశ్వరరావు బ్యాంకుకు వెళ్లి వివరాలు ఆరాతీశారు. ఒక గ్రూపు సభ్యులు రూ.4 లక్షలు బ్యాంకులో జమ చేయాలని గ్రామదీపికకు ఇస్తే ఆమె రూ.3లక్షలే జమ చేసినట్లు తేలింది. దీంతో బుధవారం వైరాలోని రైతు వేదికలో చేపట్టే విచారణకు హాజరుకావాలని వెంకటేశ్వరరావు సభ్యులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement