నాలుగు గంటల పాటు సీఎం పర్యటన
ఖమ్మం మయూరిసెంటర్: జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం 10–45గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 11–45గంటలకు మద్దులపల్లిలోని జేఎన్‌టీయూ నిర్మాణ ప్రదేశం వద్ద హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశాక సభలో ప్రసంగిస్తారు. ఆతర్వాత శ్రీశ్రీ సర్కిల్‌లోని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహానికి చేరుకుని భోజనం అనంతరం ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కాలేజీ మైదానంలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాల సభకు హాజరవుతారు. సభలో ప్రసంగించాక మధ్యాహ్నం 3–50గంటలకు హెలికాప్టర్‌లో మేడారం బయలుదేరతారు.
ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగులేటి
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపల్ పరిధిలో ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యాన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. హెలీప్యాడ్, పైలాన్, నర్సింగ్ కళాశాల వద్ద చేసిన ఏర్పాట్లను పరిశీలించాక ఆయన మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ పి.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


