హస్తగతమే లక్ష్యంగా...
న్యూస్‌రీల్
ఆ తర్వాతే ఫైనల్..
యువత విజేత..
నేడు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇటీవల ఎన్నికై న యువ సర్పంచ్‌లపై ప్రత్యేక కథనం.
● కాంగ్రెస్‌లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ● మున్సిపోల్స్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల నజర్ ● ఒక్కో వార్డుకు ఐదుగురి పేర్లతో జాబితా ! ● షెడ్యూల్ వెలువడగానే అభ్యర్థుల ప్రకటన
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలను హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తమ నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఇప్పటికే ఒక దఫా సమావేశం నిర్వహించారు. వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూడా ఆయా మున్సిపాలిటీలపై నజర్ పెట్టారు. జిల్లాలోని సత్తుపల్లి, వైరా, ఏదులాపురం, మధిర, కల్లూరు మున్సిపాలిటీల్లో పోటీకి కాంగ్రెస్ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక్కో వార్డుకు ఐదుగురు చొప్పున ఆశావహుల జాబితా తయారీకి కసరత్తు సాగుతోంది. అభ్యర్థుల గుర్తింపు పూర్తి చేశాక షెడ్యూల్ వెలువడిన వెంటనే బరిలో ఉండేదెవరో ప్రకటించనున్నారు.
ఎన్నికలు జరిగే సత్తుపల్లి, వైరా, మధిర, ఏదులాపురం, కల్లూరు మున్సిపాలిటీలపై ముగ్గురు మంత్రులు దృష్టి సారించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికలపై కసరత్తు చేశారు. అలాగే రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పార్టీ నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్న ఈ రెండేళ్ల కాలంలో మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన రహదారులు, డ్రెయినేజీలు, వీధిదీపాలు, తాగునీటి పైపులైన్ల వంటివి ప్రచారాస్త్రాలుగా చేసుకోవాలని నిర్ణయించారు.
మున్సిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అన్వేషణ ప్రారంభించింది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతుండడంతో అభ్యర్థి గుర్తింపు మరికొంత అనుకూలంగా మారుతుందనే అభిప్రాయం ఉంది. ఈ క్రమంలో ఆర్థిక, అంగ, జనబలం ఉన్నవారి కోసం వెదుకులాట ప్రారంభించింది. అన్ని రకాలుగా అనుకూలమైన అభ్యర్థులు దొరికితే వారినే బరిలో దింపాలని నిర్ణయించింది. మంత్రులతో పాటు సత్తుపల్లి, వైరా, కల్లూరు మున్సిపాలిటీల ఎన్నికలపై ఆయా ఎమ్మెల్యేలు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇందుకోసం వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితోపాటు ఐదుగురి చొప్పున కో ఆర్డినేషన్ కమిటీలు వేశారు. వీరి నేతృత్వంలో వార్డుల వారీగా అభ్యర్థుల గుర్తింపు చేపడుతున్నారు. ఒక్కోవార్డుకు ఐదుగురు ఆశావహులను ఎంపిక చేసి, ఆ జాబితాను పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేలు, మంత్రులకు అందజేస్తారు. దీంతో ఆశావహులు తమ బలాబలాలను కమిటీలకు తెలియజేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ పరిణామాలతో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికే కీలకమని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకోసం ఆశావహుల జాబితాలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ కానీ, నోటిఫికేషన్ కానీ విడుదల కాలేదు. అయితే అందరికన్నా ముందుగానే ఆ పార్టీ అభ్యర్థుల వేట ప్రారంభించింది. నోటిఫికేషన్ వెలువడేలోపు వార్డుల్లో నియమించిన కమిటీలు ఐదుగురు ఆశావహులతో జాబితా తయారు చేయనుండగా.. అభ్యర్థుల ప్రకటనకు మాత్రం సమయం పట్టనుంది. కమిటీలు పంపిన జాబితాను పరిశీలించి నోటిఫికేష న్ వెలువడిన వెంటనే అన్ని అర్హతలు గల వారిని ప్రకటించాలని పార్టీ యోచిస్తోంది.
హస్తగతమే లక్ష్యంగా...
హస్తగతమే లక్ష్యంగా...


