విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి..
గతేడాది డిగ్రీ పూర్తి చేసిన నన్ను గ్రామస్తులే సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ప్రోత్సహించి గెలిపించారు. గ్రామాభివృద్ధిలో భాగంగా గ్రామంలో రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్ లైటింగ్, కల్వర్టు నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రానికి ప్రహరీ, ఐటీడీఏ జీపీఎస్ పాఠశాలకు కొత్త భవనం కోసం ఇటీవల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారెకు విన్నవించాం. సమగ్ర అభివృద్ధి కోసం ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. పురోగతి సాధించాలంటే యువతను చైతన్యవంతులుగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– చిప్పల పండురెడ్డి, మొద్దులమడ సర్పంచ్,
అశ్వారావుపేట మండలం


