జిల్లాలో నేడు కవిత పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్/మధిర : జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శాతవాహన రైలు ద్వారా ఆదివారం రాత్రి మధిరకు చేరుకున్నారు. సాధారణ ప్రయాణికురాలిగా వచ్చిన కవిత.. రైలులో అందరితోనూ మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సోమవారం ఆమె పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు జమలాపురం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. 9 గంటలకు మధిరలో, మధ్యాహ్నం 12.30 గంటలకు సత్తుపల్లిలో పర్యటిస్తారు. 2.30 గంటలకు సత్తుపల్లి (సింగరేణి) జేవీఆర్ ఓపెన్ కాస్ట్‌ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు వైరా నియోజకవర్గ కేంద్రంలో కూరగాయల మార్కెట్‌లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. సాయంత్రం 6 గంటలకు ఖమ్మం జెడ్పీసెంటర్‌లో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద, 6.15 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులర్పిస్తారు. 6.30 గంటలకు పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న గ్రంథాలయంలో యువతతో సమావేశం అవుతారు.
హైదరాబాద్ నుంచి రైలులో మధిరకు..


