
యూరియా కోసం ఆందోళన వద్దు..
వైరారూరల్/తల్లాడ: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నందున రైతులు ఆందోళన చెందొద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. వైరా పీఏసీఎస్ పరిధి సిరిపురం ఎల్‌ఎస్‌సీఎస్‌తో పాటు తల్లాడ మండలం తల్లాడ, గంగదేవిపాడు సొసైటీల్లో నిల్వ ఉన్న యూరియాను గురువారం డీఏఓ పరిశీలించి మాట్లాడారు. సొసైటీల్లో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నందున అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. కాగా, వ్యాపారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే యూరియా అమ్మాలని, ఎవరైనా బ్లాక్ చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని డీఏఓ హెచ్చరించారు. ఏఓలు మయాన్ మంజుఖాన్, ఎం.డీ.తాజుద్దీన్, ఏఈఓలు వెంపటి కీర్తి, మేడా రాజేష్, హసీనా, మాధవి, ముర ళి, శివకుమార్, సాయి, సొసైటీల సీఈఓలు నారపోగు నాగరాజు, నాగబాబు, రాకేష్ పాల్గొన్నారు.