ఆశ్రీ.. ఉన్నాయి అంతే! | - | Sakshi
Sakshi News home page

ఆశ్రీ.. ఉన్నాయి అంతే!

Aug 2 2025 6:36 AM | Updated on Aug 2 2025 6:36 AM

ఆశ్రీ

ఆశ్రీ.. ఉన్నాయి అంతే!

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య నిత్యకృత్యమైంది. అనేక పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఈ

విషయంలో బాలికల తిప్పలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ప్రభుత్వం మరుగుదొడ్ల ఏర్పాటు, మరమ్మతులపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడమే కాక పలు చోట్ల నీటి

సరఫరా లేకపోవడం.. ఇంకొన్ని చోట్ల తలుపులు బేడాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

ఇలా ఉండాల్సిందే..

పాఠశాలలో టాయిలెట్లు, యూరినల్స్‌ నిర్మాణంపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్‌, ప్రతీ పది మందికి ఒక యూరినల్‌ ఉండాలి. కానీ ఎక్కడా ఇలా ఉన్న దాఖలాలు కానరావు. ప్రభుత్వం తరఫున చొరవ లేకపోగా విద్యాశాఖ అధికారులు సైతం పట్టించుకోకపోవడం విద్యార్థుల సమస్యకు కారణమవుతోంది.

ప్రతిపాదనలతోనే సరి

జిల్లాలోని పలు పాఠశాలల్లో టాయిలెట్ల అవసరాన్ని విద్యాశాఖ అధికారులు గుర్తించారు. బాలురకు సంబంధించి 75 పాఠశాలల్లో 75, బాలికలకు సంబంధించి ఆరు పాఠశాలల్లో ఆరు టాయిలెట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. అలాగే, 14 పాఠశాలల్లో బాలురకు 103 టాయిలెట్లు, ఐదు చోట్ల బాలికలకు 26 టాయిలెట్ల మరమ్మతులు చేయించాలని పేర్కొన్నగా ప్రతిపాదనల దశ దాటలేదు. కానీ అమ్మ ఆదర్శపా ఠశాలల కమిటీల ఆధ్వర్యాన బాలురకు 89 టాయిలెట్లు, బాలికలకు 21 టాయిలెట్ల మరమ్మతు చేయించారు.

లెక్కలో అంతా సరి...

జిల్లాలో 1,216 పాఠశాలలు ఉండగా పలు స్కూళ్లలో విద్యార్థులు మరుగుదొడ్ల సమస్య ఎదుర్కొంటున్నారు. కానీ అధికారులు మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్లు లెక్కలు చూపిస్తుండడం గమనార్హం. జిల్లాలో బాలురకు 4,741 టాయిలెట్లు ఉండగా.. అందులో 4,591 టాయిలెట్లు సక్రమంగా పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇక బాలికలకు 5,871 మరుగుదొడ్లు ఉండగా.. అందులో 5,694 పనిచేస్తున్నాయని తేల్చారు. కానీ చాలా పాఠశాలల్లో మరుగుదొడ్లు అలంకారప్రాయంగా మారా యని విద్యార్థుల ద్వారా తెలుస్తోంది. కొన్నిచోట్ల నీటి సమస్య ఉండగా.. మరికొన్ని చోట్ల పైపులైన్లు ధ్వంసమై, తలుపులు, కిటికీలు దెబ్బతినడంతో ఉపయోగించుకునే వీలుండడం లేదు.

సరిపడినంతగా లేవు..

ఖమ్మం నడిబొడ్డున ఇందిరానగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 157 మంది బాలికలు, 278 మంది బాలురు చదువుతున్నారు. గత ఏడాది వరకు ఈ పాఠశాలలో బాలురకు యూరినల్సే లేవు. దీంతో సమీపంలోని పబ్లిక్‌ టాయిలెట్‌కు వెళ్లేవారు. గత ఏడాది కొత్తగా 16 యూరినల్స్‌ నిర్మించడంతో కొంత ఇబ్బంది తీరింది. బాలికలకు ఐదు యూరినల్స్‌, రెండు మరుగుదొడ్లు ఉండగా.. విద్యార్థుల సంఖ్యకు ఇవి సరిపోవడం లేదు. ఇంకా బాలురకు రెండు, బాలికలకు మూడు యూరినల్స్‌ నిర్మించాల్సి ఉంది. అలాగే, ఈ పాఠశాలలో మహిళా టీచర్లకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు లేకపోవడం గమనార్హం.

క్యూ కట్టాల్సిందే..

కారేపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 121 మంది బాలురు, 45 మంది బాలికలు చదువుతున్నారు. ఇక్కడ బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్నా ఇవి సరిపడా లేక క్యూ కట్టాల్సి వస్తోంది. ఇక్కడ ౖపైలెన్‌ పగిలి నీటి సౌకర్యం లేదు. టాయిలెట్ల తలుపులకు బేడాలు లేకపోవడంతో ఎవరైనా లోనకు వెళ్తే మరొకరు బయట కాపలా ఉండాల్సి వస్తోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో

అధ్వానంగా మరుగుదొడ్లు

పలు స్కూళ్లలో మరుగుదొడ్లు ఉన్నా నీరు కరువు

కనీస మరమ్మతులకు నోచుకోక

నిరుపయోగంగా..

ఫలితంగా విద్యార్థులు,

ఉపాధ్యాయినుల ఇబ్బందులు

నీరు తెచ్చుకోవాలి..

కామేపల్లి మండలం కొమ్మినేపల్లి ప్రాథమిక పాఠశాల మరుగుదొడ్డిలో నీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్డిపై ట్యాంక్‌ నిర్మించినా బోర్‌ మోటార్‌ నుంచి పైపులైను కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో ప్రతిరోజు స్కావెంజర్‌ నీరు సమకూర్చాల్సి వస్తోంది.

మరమ్మతు చేయించాలి..

మా పాఠశాలలో టాయిలెట్లు సరిగా లేవు. పైపులైన్లు పగిలి నీళ్లు సరిగా రావడం లేదు. వచ్చినా వృథా అవుతోంది. గోడలన్నీ బీటలు బారాయి. టాయిలెట్‌కు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉన్నందున మరమ్మతులు చేయిస్తే బాగుంటుంది.

– కె.లాస్య, పదవ తరగతి, కారేపల్లి హైస్కూల్‌

ఆశ్రీ.. ఉన్నాయి అంతే!1
1/3

ఆశ్రీ.. ఉన్నాయి అంతే!

ఆశ్రీ.. ఉన్నాయి అంతే!2
2/3

ఆశ్రీ.. ఉన్నాయి అంతే!

ఆశ్రీ.. ఉన్నాయి అంతే!3
3/3

ఆశ్రీ.. ఉన్నాయి అంతే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement