
అమృతం కంటే విలువైనవి తల్లి పాలు
ఖమ్మంవైద్యవిభాగం: తల్లిపాలు అమృతం కంటే విలువైనవని, బిడ్డ ఎదుగుదలకు దోహదపడతాయని ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ మెతుకు నరేందర్ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన డీఎంహెచ్‌ఓ బి.కళావతిబాయితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంసీహెచ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో నరేందర్ మాట్లాడుతూ పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించడం వల్ల రోగ నిరోధక శక్తి వస్తుందని, తల్లికి కూడా ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈమేరకు వారం పాటు తల్లి పాల ఆవశ్యకతపై అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్, వివిధ విభాగాల వైద్యులు, ఉద్యోగులు బాబు రత్నాకర్, రాంబాబు, వినాయక్ రాథోడ్, యామిని, కిరణ్‌కుమార్, పవన్‌కుమార్, డి.శాంతకుమారి, శేషు పద్మ, రఘురాం పాల్గొన్నారు.
పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్