
మరింత వేగంగా ఆధునికీకరణ పనులు
ఖమ్మం రాపర్తినగర్/మధిర: రైల్వేస్టేషన్లలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం ఎం. గోపాలకృష్ణన్ ఆదేశించారు. జిల్లాలోని ఖమ్మం, మధిర స్టేషన్లలో పనులను శుక్రవారం ఆయన తని ఖీ చేశారు. ఖమ్మంలో తనిఖీల సందర్భంగా అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్న ఆయన ఇకనైనా వేగం పెంచకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసందర్భంగా ఖమ్మంలో ఎక్సలేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, విశ్రాంతి భవన్, రైల్వేస్టేషన్ కార్యాలయం పనులపై సూచనలు చేశారు. అలాగే, మధిర స్టేషన్‌లోని 1, 2వ నంబర్ ప్లాట్‌ఫారంలపై పనులు పరిశీలించిన డీఆర్‌ఎం ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈకార్యక్రమాల్లో ఖమ్మం రైల్వే స్టేషన్ మేనేజర్ సుభాస్ చంద్రబోస్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసులు పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్లలో తనిఖీ చేసిన డీఆర్‌ఎం