
ఖమ్మంలో గ్రానైట్, మార్బుల్ నైపుణ్య శిక్షణ కేంద్రం
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలో గ్రానైట్, మార్బుల్ వ్యాపారం మరింత అభివృద్ధి చెందేలా ఫిగ్సీ(ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ గ్రానైట్, స్టోన్ ఇండస్ట్రీ) ఆధ్వర్యాన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు నిర్వాహకులు సంసిద్ధత వ్యక్తం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పూణేలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం వెళ్లిన మంత్రి తుమ్మల ఫిగ్సీ చైర్మన్ ఇష్వీందర్ సింగ్ ఆహ్వానంతో అక్కడి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా యువతకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించిన మంత్రి.. ఖమ్మంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాలని సూచించారు. ఈమేరకు చైర్మన్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే సెంటర్ ఏర్పాటు చేస్తామని బదులిచ్చారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నాయకుడు సాదు రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అప్రమత్తతతోనే
వ్యాధులు దూరం
కూసుమంచి: ప్రతీఒక్కరు ఇళ్లలోనే కాక పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ అప్రమత్తంగా ఉంటేనే సీజనల్ వ్యాధులు దరిచేరవని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. మండలంలోని పాలేరు, గైగొళ్లపల్లి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. డ్రై డే కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించిన అదనపు కలెక్టర్.. ఇళ్ల ముందు వర్షపు, మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అలాగే, గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహణతో జ్వరాలను అదుపు చేయవచ్చని తెలిపారు. కాగా, గైగొళ్లపల్లిలో చేయూత పెన్షన్ల పంపిణీ తీరుపై ఆరా తీసిన శ్రీజ లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి చేయూత
ఖమ్మంవ్యవసాయం: విధినిర్వహణలో ప్రమాదవశాత్తు మృతి చెందిన పాడి పరిశ్రమ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ రూ.10లక్షల ఆర్థిసాయాన్ని మంజూరు చేసింది. విజయ డెయిరీ ఖమ్మం యూనిట్ పరిధి కామేపల్లి మండలం కొత్తలింగాలలో పదేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పులి నాగేశ్వరరావు శరీరంపై ఇటీవల యాసిడ్ పడింది. ఎక్కడ చికిత్స చేయించినా ఫలితం లేక మృతి చెందడంతో ఆయన కుటుంబానికి రూ.10లక్షల సాయం ప్రకటించారు. ఈమేరకు నాగేశ్వరరావు భార్య సుగుణమ్మకు హైదరాబాద్‌లో విజయ డెయిరీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి చెక్కు అందజేశారు.
డ్రగ్ స్టోర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని పాత డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కొనసాగుతున్న సెంట్ర ల్ డ్రగ్ స్టోర్‌ను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి బి.కళావతిబాయి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందుల స్టాక్, రికార్డులు, పీహెచ్‌సీలకు సరఫరా, నిల్వల తీరును పరిశీలించారు. మందుల లభ్యత, గడువును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మేర స్టాక్ తెప్పించుకోవాలని ఉద్యోగులకు సూచించారు. తద్వారా కొరత ఎదురుకాదని తెలిపారు. అంతేకాకుండా నిల్వల విషయంలో జాగ్రత్తలు పాటించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు.

ఖమ్మంలో గ్రానైట్, మార్బుల్ నైపుణ్య శిక్షణ కేంద్రం

ఖమ్మంలో గ్రానైట్, మార్బుల్ నైపుణ్య శిక్షణ కేంద్రం

ఖమ్మంలో గ్రానైట్, మార్బుల్ నైపుణ్య శిక్షణ కేంద్రం