డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సంబరాలు
ఖమ్మంవైద్యవిభాగం: ఫార్మాసిస్టులను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక గేజిట్ ద్వారా ‘ఫార్మసీ ఆఫీసర్’గా ప్రమోషన్ ఇచ్చిన సందర్భంగా గురువారం ఐడీఓసీ ప్రాంగణంలోని స్ఫూర్తి కాన్ఫరెన్స్ హాల్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎంహెచ్‌ఓ డాక్టర్ కళావతిబాయి మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల లాగే పేషంట్లను ఆరోగ్యవంతులుగా చేయడంలో ఫార్మసీ ఆఫీసర్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారన్నారు. అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఆదేశాలు అందిన నేపథ్యాన ఇకనుంచి ఫార్మాసిస్ట్ గ్రేడ్–1ను సీనియర్ ఫార్మసీ ఆఫీసర్‌గా, గ్రేడ్–2ను ఫార్మసీ ఆఫీసర్‌గా, జిల్లా ఫార్మసీ సూపర్‌వైజర్‌ను జిల్లా ఫార్మసీ ఆఫీసర్‌గా మారుస్తూ జీఓ నంబర్ 71 ద్వారా తెలియజేయడం అభినందనీయమన్నారు. ఫార్మాసీ ఆఫీసర్లు ఈ ఔషది పోర్టల్‌లో కూడా మందుల వివరాలు అన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌ఓను ఫార్మసిస్టులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సైదులు, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ చందునాయక్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ రామారావు, స్టాటిస్టికల్ ఆఫీసర్ నవీన్, జిల్లా ఫార్మసీ ఆఫీసర్ (ఇన్‌చార్జ్) మోహన్, సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ఫార్మసీ ఆఫీసర్ మంగీలాల్, పద్మ, లింగమూర్తి, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.


