జానపదంలోనే మన మూలాలు..
ఖమ్మంసహకారనగర్: సాహిత్య అధ్యయనం, పరిశోధకులతో మానవ జీవితంలోని జీవనాంశాలు అర్థం చేసుకోవచ్చని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి అన్నారు. ఇదే సమయాన మన మూలాలు జానపదంలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. జానపద సాహిత్య, విజ్ఞాన పరిశోధక బ్రహ్మ ఆచార్య బిరుదురాజు రామరాజు శతజయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో విభిన్నమైన సాహిత్యకారుడిగా నిలిచిన బిరుదురాజు స్ఫూర్తిగా విద్యార్థులు సాహిత్యపఠనం, పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. విశ్రాంత ఆచార్యులు డాక్టర్ గన్నమరాజు మనోహర్‌బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎల్.ఎన్.శాస్త్రి, తెలుగు విభాగాధిపతి డాక్టర్ పి.రవికుమార్ మాట్లాడారు. ఇంకా ఈ సదస్సులో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బానోత్ రెడ్డి, రవిమారుత్, ప్రసేన్, డాక్టర్ ఎం.సునంద, యాకూబ్, సమతా శ్రీధర్, డాక్టర్ సీతారాం, డాక్టర్ మంథని శంకర్, డాక్టర్ జె.అనురాధ, కపిల భారతి, వాహెద్, కిరణ్, కోటమ్మ, ఎం.వీ.రమణ, కార్తీక్, వై.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ
కార్యదర్శి బాలాచారి


