శ్రద్ధగా చదివి ఉద్యోగాలు సాధించండి.. | - | Sakshi
Sakshi News home page

శ్రద్ధగా చదివి ఉద్యోగాలు సాధించండి..

Apr 9 2025 1:00 AM | Updated on Apr 9 2025 1:00 AM

శ్రద్ధగా చదివి ఉద్యోగాలు సాధించండి..

శ్రద్ధగా చదివి ఉద్యోగాలు సాధించండి..

సత్తుపల్లిటౌన్‌: ‘ఏ పరీక్షకు సిద్ధమవుతున్నారు.. సమయం సరిపోతోందా.. అన్ని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయా.. ఏమైనా సదుపాయాలు కావా లన్నా కల్పిస్తాం.. శ్రద్ధగా చదివి పోటీ పరీక్షల్లో విజ యం సాధించి ఉద్యోగాలకు ఎంపిక కండి’ అని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీజ సూచించారు. సత్తుపల్లిలోని మోడ్రన్‌ లైబ్రరీని మంగళవారం సందర్శించిన ఆమె అక్కడి అభ్యర్థులతో మాట్లాడారు. సెల వు రోజుల్లో మూసివేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామని పలువురు చెప్పగా అన్ని రోజులు తెరిచి ఉంచాలని లైబ్రేరియన్‌ మల్లికార్జున్‌ను ఆదేశించారు. ఉదయం 7నుంచి రాత్రి 7గంటల వరకు పనిచేసేలా ఉద్యోగులు సమయం సర్దుబాటు చేసుకోవా లని, మాక్‌టెస్టుల నిర్వహణకు నాలుగు కంప్యూటర్లను సమకూర్చి ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచాలని సూచించారు.

అభివృద్ధి పనుల పరిశీలన

సత్తుపల్లిలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న మోడ్రన్‌ ధోబీఘాట్‌ను జూలై కల్లా పూర్తి చేసి యంత్రాలు సమకూర్చాలని అదనపు కలెక్టర్‌ శ్రీజ ఆదేశించారు. ధోబీఘాట్‌తో పాటు ఎన్టీఆర్‌నగర్‌లో రూ.1.48 కోట్లతో నిర్మిస్తున్న యూపీహెచ్‌సీని పనులను పరిశీలించి సూచనలు చేశారు. ఆతర్వాత స్వామి వివేకానంద ఎక్స్‌లెన్స్‌ భవనంలో తనిఖీ చేసి మిగిలిన పనులు పూర్తి చేయాలని తెలిపారు. అర్బన్‌ పార్క్‌లో బ్యాటరీకారుపై కలియదిగిగిన ఆమె పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు సమకూర్చాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయం, ఎస్టీ బాలుర, ఎస్సీ బాలికల హాస్టళ్లను సైతం తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ నర్సింహ, రేంజర్‌ స్నేహలత, ఎంపీడీఓ ఆర్‌.చిన్ననాగేశ్వరరావు, ఏఈ సురేష్‌, మేనేజర్‌ మైసా శ్రీనివాసరావు, హెచ్‌డబ్ల్యూఓలు రాములు, దారుగాబి, ఎంపీఈఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement