‘రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ’
సత్తుపల్లి/వేంసూరు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు సృష్టించడమే కాక రాజ్యాంగాన్ని అవమానిస్తోందని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంతో పాటు వేంసూరులో గురువారం జై బాపు, జై భీం, జైసంవిధాన్‌పై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గాంధీ, అంబేడ్కర్‌ను పార్లమెంట్‌లో అవమానించిన బీజేపీ పెద్దలు, రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యాన బీజేపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాక కాంగ్రెస్ పథకాలను వివరించాలని సూచించారు. నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ముక్కా శేఖర్‌గౌడ్, శివవేణు, గాదె చెన్నారావు, మందపాటి ముత్తారెడ్డి, ఆనంద్‌బాబు, తోట సుజలారాణి, చల్లగుండ్ల కృష్ణయ్య, అలవాల కరుణాకర్, కుమారి, కమల్‌పాషా, ఉడతనేని అప్పారావు పాల్గొన్నారు.


